నిరుద్యోగుల తరపున ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన షర్మిల తెలంగాణలో హైలెట్ అయ్యారు. ఇందిరా పార్క్ వద్ద కొలువులకోసం దీక్ష చేపట్టిన ఆమెను పోలీసులు బలవంతంగా తరలించడంతో మీడియాలో ఆమె దీక్ష హైలెట్ అయింది. జులై 8న పార్టీనిప్రకటించబోతున్న షర్మిల ఆలోగా జిల్లాల పర్యటన పూర్తి చేయాలనుకున్నారు. కరోనా ఆంక్షల కారణంగా కొన్నాళ్లు ఆమె బెంగళూరు వెళ్లారు. అయితే అంతలోనే టీఆర్ఎస్ రాజకీయాల్లో కుదుపు వచ్చింది. ఈటలను మంత్రి మండలినుంచి బర్తరఫ్ చేయడంతో ఆయన పార్టీమారారు. బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయ కలకలం రేగింది. ఈ దశలో పార్టీ కార్యకలాపాలను మరింత చురుగ్గా నిర్వహించాలనుకున్న షర్మిల.. తెలంగాణ పర్యటనలు ఖరారు చేసుకున్నారు.