తనతో పాటు సీబీఐ కేసుల్లో ఇబ్బంది పడిన ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మిని ఆయన పట్టుబట్టి ఏపీకి రప్పించుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమెను తెలంగాణకు కేటాయించారు. కానీ.. జగన్ ఎన్నో ప్రయత్నాల తర్వాత ఆమెను ఏపీకి రప్పించుకున్నారు.  ఏపీకి వచ్చాక ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు జగన్. ఇప్పుడు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి సూపర్ టైమ్ స్కెల్ పదోన్నతి కల్పించారు.