కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ సమయంలో ఉత్తర కొరియాలో మాత్రం ఆహార, ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందట. ఈ అంశంపై ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారి నోరు విప్పారు. తమ దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఆ సమస్య ఎందుకు వచ్చిందంటే.. కరోనా రాకుండా కఠిన ఆంక్షలు అమలు చేసిందట ఆ దేశం.