గంటా శ్రీనివాసరావు....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. పార్టీలు మారినా, నియోజకవర్గాలు మారినా ఇంతవరకు ఓటమి ఎరుగని నాయకుడు. తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గంటా, 1999 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీని వీడి ప్రజారాజ్యంలోకి వెళ్ళి అనకాపల్లి ఎమ్మెల్యేగా 2009లో గెలిచారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్లో విలీనం కావడంతో, అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.