మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్మన్గా అశోక్ గజపతిరాజు తిరిగి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ట్రస్ట్ నిబంధనలు ప్రకారం సంచయిత నియామకం చెల్లదు అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చి వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు అంటున్నారు.