రాజకీయాల్లో నేతలు పుంజుకోవాలన్నా.. కిందికి దిగిపోవాలన్నా.. ప్రజలతో వారు అనుసరించే వ్యూహాలు.. ప్రజలతో కలిసి వారు వేసే అడుగులే నిర్ణయిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పార్టీ ఏదైనా.. నాయకులు ఎవరైనా.. ప్రజలతో వారు పెంచుకునే స్నేహమే.. వారికి మద్దతుగా ఉంటుంది. ఈ విషయం ప్రతి ఒక్క నాయకుడికి తెలిసిందే. అయితే.. ఈ విషయం తెలిసి కూడా తమదైన వ్యవహారాల్లో తలమునకలైన నాయకులు.. ప్రజలను దూరం పెట్టిన నాయకులు.. ఉన్నారంటే.. ఔరా! అనిపిస్తుంది.