ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఆక్సిజన్ కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎంతో మంది కరోనా బాదితులు ఆక్సిజన్ అందక మరణించిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా పీరియడ్ లో ఆక్సిజన్ కొరత ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టడం అందరినీ ఆందోళనకు గురి చేసింది.