ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న అచ్చెన్నాయుడు జగన్ ప్రభుత్వంపై నిత్యం విరుచుకుపడుతూనే ఉన్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతలని ప్రత్యర్ధులు హతమార్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనపై చంద్రబాబుతో సహ టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఈ హత్యల వెనుక వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి హస్తం ఉందని బాబు ఆరోపిస్తున్నారు. అటు పోలీస్ వ్యవస్థపై బాబు విమర్శలు చేస్తున్నారు.