చంద్రబాబు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. గత రెండేళ్లుగా బాబు, జగన్ని విమర్శించని రోజు లేదు. అయితే బాబు చేసే విమర్శలని జగన్ పట్టించుకునే పొజిషన్లో ఉన్నట్లు కనిపించడం లేదు. జగన్...తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అయితే జగన్ పట్టించుకోకపోయిన బాబు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎప్పుడు ఏదొక అంశంలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు పెడుతూనే ఉన్నారు.