టీడీపీ ఆవిర్భావించిన మొదట్లో ఏజెన్సీ ప్రాంతాలు ఆ పార్టీకి అనుకూలంగా ఉండేవి. ఎప్పుడైతే వైఎస్సార్ లీడ్ తీసుకున్నారో, అప్పటినుంచి ఏజెన్సీల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఇక ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వైసీపీ హవా కొనసాగుతుంది. భవిష్యత్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో టీడీపీ నిలబడటం కష్టమే అని తెలుస్తోంది. ముఖ్యంగా అరకు పార్లమెంట్ పరిధిలో టీడీపీ పరిస్తితి ఘోరంగా ఉంది. వైసీపీకి కడప జిల్లా ఎంత అనుకూలంగా ఉందో అరకు కూడా అంతే అనుకూలంగా ఉంది.