యనమల రామకృష్ణుడు....రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. దశాబ్దాల పాటు తెలుగుదేశంలో కీలక నాయకుడుగా ఉన్న యనమల....ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరమైన యనమల...తన ఫ్యామిలీని రాజకీయంగా నిలబెట్టలేకపోతున్నారు. అసలు తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం యనమలకు కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి అంటే 1983 నుంచి 2004 వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో వరుసగా యనమల టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.