గతంలో టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు సమక్షంలో పసుపు కడువా కప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే అందులో నలుగురికి చంద్రబాబు మంత్రి పదవులు సైతం ఇచ్చారు. అయితే అలా జగన్ని మోసం చేసి టీడీపీకి వెళ్ళి మంత్రులైన వారి పరిస్తితి ఇప్పుడు చాలా ఘోరంగా ఉందనే చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు ఆ నలుగురు ఓటమి పాలయ్యారు.