మన స్టాక్ మార్కెట్లు పెరగాల్సిన దాని కన్నా చాలా ఎక్కువగా పెరిగాయి. మరి ఇలా అసంబద్దంగా పెరిగినప్పుడు మార్కెట్ కరెక్షన్ కావడం కూడా సహజమే. గతంలోనూ ఇలా చాలాసార్లు జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆ సమయం వచ్చినట్టు కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారు ఆచితూచి అడుగులు వేయాలని సూచిస్తున్నారు.