ఏపీలో టీడీపీ, బీజేపీ జతకలిశాయంటూ వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కేంద్రంనుంచి రావాల్సిన నిధులు రావడంలేదని, కనీసం రాష్ట్ర బీజేపీ నేతలు చొరవ చూపించి వాటిని రాబట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బీజేపీ, టీడీపీ జతకలిశాయంటూ ఆరోపణలు చేశారు సజ్జల.