గుంటూరు జిల్లా అధికార వైసీపీలో ఆధిపత్య పోరు మరింత ఎక్కువైనట్లు కనిపిస్తోంది. గతేడాది నుంచి నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినిలకు పెద్దగా పొసగడం లేదు. ఒకే పార్టీలో ఉన్న ఈ ఎమ్మెల్యే, ఎంపీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో వీరి మధ్య విభేదాలు లేవు.