ఏపీలో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు, వైసీపీ నేతల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా సంచయితని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలని హైకోర్టు కొట్టేస్తూ, తిరిగి అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపట్టాలని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అశోక్ తిరిగి ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. కానీ అశోక్‌కు అధికారులు పెద్దగా సహకరించడం లేదు.