గత కొన్నేళ్లుగా తన వారసుడుని రాజకీయాల్లో సక్సెస్ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే ఇదే టీడీపీకి బాగా మైనస్ అయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా, దొడ్డిదారిన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడం ఏంటని వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి. అలాగే లోకేష్‌గా మంత్రిగా ఎలాంటి పనితీరు కనబర్చారో తెలియదుగానీ, టీడీపీ నాయకుడుగా మాత్రం ఫెయిల్ అయ్యారు.