గౌరు చరితారెడ్డి....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకురాలు. దివంగత వైఎస్సార్‌కు అంత్యంత సన్నిహితంగా మెలిగిన నాయకురాలు. వైఎస్సార్, చరితాని సోదరిగా భావించి 2004లో నందికొట్కూరు కాంగ్రెస్ టిక్కెట్ కూడా ఇచ్చారు. ఇక వైఎస్సార్ వేవ్‌లో చరితా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక వైఎస్సార్ మరణం తర్వాత చరితా జగన్ వెంట నడిచారు. జగన్‌కు అండగా ఉంటూ వైసీపీలో బలమైన నాయకురాలుగా ఎదిగారు.