రాయిటర్స్ సర్వే ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల 40 లక్షల మంది వరకూ చనిపోయారట. అయితే ఈ మరణాల సంఖ్య క్రమంగా మొదట్లో పెరుగుతూ వచ్చిందట. తొలి 20 లక్షల మరణాల నమోదుకు ఏడాది కాలం పట్టిందట. కానీ.. ఆ తర్వాత మరో 20 లక్షలు చేరుకునేందుకు కేవలం 166 రోజుల సమయం మాత్రమే పట్టిందని రాయిటర్స్ సంస్థ చెబుతోంది.