1958 జాతీయ క్రీడల్లో మిల్కా సింగ్ రెండు బంగారు పతకాలు సాధించారు. 1958లో బ్రిటీష్ ప్రభుత్వం, కామన్వెల్త్ నిర్వహించిన పోటీల్లో 46.6 సెకన్లలో 440 యార్డ్స్ పరుగెత్తి స్వర్ణం గెలిచారు. భారత్ తరఫున స్వర్ణం సాధించిన తొలి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. ఈ మిల్కా రికార్డును నాలుగు దశాబ్దాలపాటు ఎవరూ అధిగమించలేకపోయారు.