టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఇళ్లపై ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే అవినీతి ఆరోపణల తరవాత నామా నాగేశ్వర్ రావు మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చారు. తన గురించి ప్రజలకు తెలుసని అన్నారు. తాను ఎప్పుడూ నీతి నిజాయితీగా ఉన్నానని నామా వ్యాఖ్యానించారు.