టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ...టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ....గత రెండు సంవత్సరాలలో అనేక నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఎల్ 1 దర్శనాలు రద్దు చేసామని అన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ చేసామని చెప్పారు.