దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ కారణంగా చాలా మంది జీవనోపాధి కోల్పోయిన ఘటనలను చూస్తూనే ఉన్నాము. ఈ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే.