దివంగత మండలి వెంకటకృష్ణారావు... దివిసీమ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. పేదవర్గాలకు ఆపద్భాందువుడుగా పేరు తెచ్చుకున్న మండలి దశాబ్దాల పాటు కాంగ్రెస్లో రాజకీయాలు చేశారు. అవనిగడ్డ నియోజకవర్గం వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన వెంటనే జరిగిన 1983 ఎన్నికల్లో సైతం అవనిగడ్డలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేశారు. ఇక కృష్ణారావు తర్వాత, అవనిగడ్డలో ఆయన వారసుడు బుద్దప్రసాద్ సత్తా చాటారు.