గత కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా విజయవాడ టీడీపీలో అంతర్గత విభేదాలు పెద్ద ఎత్తున బయటపడిన విషయం తెలిసిందే. ఎంపీ కేశినేని కుమార్తె శ్వేత విజయవాడ మేయర్ అభ్యర్ధిగా రంగంలోకి దిగడంతో అసలు రచ్చ మొదలైంది. శ్వేతని బుద్దా వెంకన్న, బోండా ఉమా వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నాని సైతం బుద్దా-బోండాలు టార్గెట్గా విమర్శలు గుప్పించారు. ఎవరు సపోర్ట్ చేసినా, చేయకపోయినా విజయవాడలో టీడీపీని గెలిపించుకుంటానని ఛాలెంజ్ చేశారు.