పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఏపీలో పెద్దగా బలం లేదనే చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఏ మాత్రం సత్తా చాటలేకపోయింది. కేవలం ఒక్క సీటు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు అలా గెలిచిన ఎమ్మెల్యే సైతం జగన్ ప్రభుత్వానికి మద్ధతుగా పనిచేస్తున్నారు. అయితే ఆ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో బలం ఉందని ఎన్నికల్లోనే రుజువైంది. ముఖ్యంగా కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో జనసేనకు కొద్దో గొప్పో బలం ఉంది.