ఏపీలో అధికార వైసీపీలో పదవుల కోలాహాలం మొదలైంది. ఈ యేడాదిలో భారీగా ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. ఇప్పటికే పరిషత్ ఎన్నికల ఫలితాలు వస్తే వెంటనే 8 ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేస్తారు. ఇక ఎమ్మెల్యేల కోటాలో కూడా ఐదారు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. ఇవన్నీ అధికార వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఇక వీటి సంగతి పక్కన పెడితే వచ్చే యేడాది ఆరంభంలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు స్థానాలకు జగన్ రాజ్యసభ సభ్యులుగా ఎవరిని ఎంపిక చేస్తారు ? అన్నదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా ఉంది. ఎందుకంటే నాలుగు రాజ్యసభ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.