పాపం ఆయన ఎంపీగా గెలిచి పట్టుమని రెండు నెలలు అయినా కాలేదు.. అప్పుడే ఆయనకు వైసీపీలో చుక్కలు కనపడుతున్నాయట. పార్టీ సీనియర్లు, మంత్రులు ఆయన్ను ఓ ఆటాడేసుకుంటున్నారట. ఇదే విషయం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎవరా కుర్ర ఎంపీ.. ఏమా కథ అన్నది చూద్దాం. తిరుపతి ఉప ఎన్నికల్లో డాక్టర్ గురుమూర్తి ఎంపీగా గెలిచారు. 3.70 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచిన గురుమూర్తి ఎంపీగా ఇంకా పార్లమెంటులో ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అప్పుడే ఆయన్ను నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఉన్న సీనియర్ వైసీపీ నేతలు, మంత్రులు ఆడేసుకుంటున్నారట. నువ్వు మా కోటరిలో ఉండాలంటే.. మా కోటరీలో ఉండాలని ఆయనపై ఒత్తిడి చేస్తున్నారట.