మాస్ వ్యాక్సినేషన్ తో సరికొత్త రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. భవిష్యత్తులో ఏపీకి ఎక్కువ వ్యాక్సిన్ల కేటాయింపుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుని డోసులను కేంద్రం అందించగలిగితే, ఏపీకి ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. దీనికోసం ఇలా మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లు ఏర్పాటు చేసి, ఏపీ సత్తా చాటిచెబుతున్నారు. గతంలో తన రికార్డుని తానే అధిగమించిన ఏపీ.. ఒక్కరోజులోనే 11.85లక్షలమందికి టీకాలు వేసి సరికొత్త రికార్డు సృష్టించింది.