కరోనా సెకండ్ వేవ్ తొలినాళ్లలో ముంబైలో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మహారాష్ట్రలో కేసులు భారీగా పెరిగిపోయిన తర్వాత అక్కడ లాక్ డౌన్ విధించారు. అదే సమయంలో ఢిల్లీలో కూడా కేసులు పెరగడంతో ముందస్తుగా లాక్ డౌన్ విధించి కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రతాపం తగ్గిన తర్వాత దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య పడిపోయింది. ఈ నేపథ్యంలో అన్ లాక్ వ్యవహారంతో ఢిల్లీ, హైదరాబాద్ మరోసారి వార్తల్లోకెక్కాయి. ఢిల్లీ, హైదరాబాద్ లో పూర్తిగా నిబంధనలపై పట్టు సడలించడంతో జనసంచారం బాగా పెరిగిపోయింది.