అన్ని దానాల్లో కెల్లా గొప్ప దానం ఏంటంటే.. రకరకాల సమాధానాలు వినిపిస్తుంటాయి. ఈమధ్య కరోనా కాలంలో రక్తదానం, ప్లాస్మాదానం అనేవి ప్రముఖంగా వినిపించాయి. కానీ ఇప్పుడు ఉత్తర కొరియాలో మాత్రం మూత్రదానం అనేది బాగా ఫేమస్ అవుతోంది. అవును, స్వయానా ఆ దేశాధ్యక్షుడే మూత్రదానం చేయాలంటూ రైతులకు పిలుపునిచ్చాడు. యూరియాను స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు రైతులంతా తమ యూరిన్ దానం చేయాలని పిలుపునిచ్చారు.