ఆ కుటుంబం ఇప్పుడు వైసీపీలో ఉంది. వైసీపీ అధినేత సీఎం జగన్ కనుసన్నల్లో మసులుతోంది. అలాంటిది ఇప్పుడు వైసీపీ ఒకింత గుంభనంగా వ్యవహరిస్తున్న ఓ విషయంలో దూకుడుగా వ్యవహరించింది. వైసీపీ సీనియర్లు, పార్టీ అధినేత కూడా దూరం పెట్టినా.. దూరంగా ఉన్న ఆ విషయంలో `తగుదునమ్మా` అంటూ.. వ్యవహరిస్తోందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇదే విషయంపై వైసీపీలోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రకాశం జిల్లా చీరాల నుంచి గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై విజయం సాధించిన కరణం బలరామకృష్ణమూర్తి తర్వాత వైసీపీ పంచన చేరిపోయారు.