నేడు మఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్, యాదాద్రి జిల్లాల్లో పర్యటించారు. వరంగల్ లో కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన కలెక్టర్ భవనం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పరిపాలన విభాగం లో పనులు తొందరగా జరగాలని అడ్మినిస్ట్రేషన్ బాగుండాలని తెలిపారు. వరంగల్ ,హన్మకొండ జిల్లాలను ఏర్పాటు చేస్తూ రెండు మూడు రోజుల్లో అనుమతులు ఇస్తామన్నారు.