ఏపీలో విశాఖ వేదికగా హాట్ హాట్ రాజకీయాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖలో టీడీపీ నేతల టార్గెట్‌గా వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా పలువురు టీడీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని, వారి అక్రమాలు అన్నీ ఇప్పుడు బయటపెడతామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌పై భూ కబ్జా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అటు ఆయన పలు అక్రమ కట్టడాలని కట్టారని, వాటిని కూల్చే పనిలో పడ్డారు.