ఏపీలో అధికార వైసీపీకి 22 మంది లోక్సభ సభ్యుల బలం ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు హోదా తెస్తాను 25కి 25 మంది ఎంపీలని ఇవ్వండని జగన్ ప్రచారం చేస్తే ఎన్నికల్లో ప్రజలు 22 మంది ఎంపీలని గెలిపించారు. ఇక టీడీపీ తరుపున ముగ్గురు ఎంపీలు గెలిచారు. అయితే వైసీపీ తరుపున గెలిచిన 22 మంది ఎంపీలు, ఈ రెండేళ్లలో ఏం సాధించారు? అంటే చెప్పడం కష్టమే. రాష్ట్రం కోసం ఏం తీసుకొచ్చారు?అని అడిగిన ఏం సమాధానం రాదు.