కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం కరోనాతో చనిపోయిన వైద్య, పారిశుధ్య సిబ్బందికి భారీగా ఎక్స్ గ్రేషియా ఇస్తోంది. కరోనా వల్ల కుటుంబ సభ్యుల్నికోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు కూడా అండగా నిలబడుతోంది. కానీ కేంద్రం మాత్రం కరోనా బాధితులు, కరోనాతో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు ఇంతరవకు ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. ఈ దశలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరుగుతున్నాయి. కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.4లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వడంపై కేంద్రం మరోసారి తన నిస్సహాయత వ్యక్తం చేసింది.