ఏపీలో సీనియర్ నాయకులు...నిదానంగా తమ వారసులని లైన్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్లు...తమ వారసులని రాజకీయాల్లో యాక్టివ్ చేశారు. అలాగే గత ఎన్నికల్లో పలువురు సీనియర్లు పోటీ నుంచి తప్పుకుని, తమ వారసులని ఎన్నికల బరిలో నిలబెట్టారు. వచ్చే ఎన్నికల్లో సైతం మరికొందరు సీనియర్ నేతలు రాజకీయాల నుంచి కాస్త బయటకొచ్చి విశ్రాంతి తీసుకుందామని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తమ వారసులని ఎన్నికల బరిలో నిలబెట్టడానికి సిద్ధమవుతున్నారు.