ఏపీ బీజేపీ అద్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజుకు ఎమ్మెల్యేగా గెలిచే సత్తా ఉందా? సొంతంగా ఆయనకు అదిరిపోయే ఇమేజ్ ఉందా? అంటే చెప్పడం చాలా కష్టం. చాలా ఏళ్లుగా బీజేపీలో కీలక నాయకుడుగా ఉన్న సోము వీర్రాజుకు గత చంద్రబాబు ప్రభుత్వం పొత్తులో భాగంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఆ ఎమ్మెల్సీ పదవితోనే సోము కాస్త రాష్ట్ర రాజకీయాల్లో హైలైట్ అయ్యారు.