గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఏ మేర విఫలమైందో అందరికీ తెలిసిందే. ఆ పార్టీ కేవలం ఒకస్థానంలో మాత్రమే గెలవగలిగింది. కాకపోతే కొన్ని జిల్లాల్లో గెలుపోటములని మాత్రం ప్రభావితం చేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో మంచిగా ఓట్లు తెచ్చుకుని టీడీపీని దెబ్బకొట్టింది. చాలా నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చి, టీడీపీకి డ్యామేజ్ చేసి, వైసీపీ గెలిచేలా చేసింది.