ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో సైతం పలువురు ఫైర్ బ్రాండ్ నాయకులున్నారు. అధికారం కోల్పోయినా సరే పార్టీకి అండగా ఉంటూ ప్రత్యర్ధులపై విరుచుకుపడే నేతల్లో ఎంఎస్ రాజు ముందు వరుసలో ఉంటారు. దళిత నేతగా ఉన్న రాజు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల ముందు వరకు రాజు గురించి టీడీపీ కార్యకర్తలకే పెద్దగా తెలియదు.