కొవాక్సిన్ టీకా కుంభకోణం బ్రెజిల్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇవ్వకపోయినా, స్థానిక బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా, భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాక్సిన్ పంపిణీకి బ్రెజిల్ ప్రభుత్వం సిద్ధపడింది. ఈ క్రమంలో 2కోట్ల డోసుల కొనుగోలుకి ఒప్పందం కుదిరింది. 2230కోట్ల రూపాయల డీల్ ఇది. ఇందులో ప్రెసిసా అనే కంపెనీ మధ్యవర్తిత్వం నెరిపింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఉన్న టీకాలను పక్కనపెట్టి కొవాక్సిన్ కోసం బ్రెజిల్ ప్రభుత్వం పట్టుబట్టడం విమర్శలకు తావిస్తోంది.