విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు పెట్టడానికి సిద్ధమయ్యామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం, వారి ఆరోగ్యంపై కూడా తమకు శ్రద్ధ ఉందని చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం పరీక్షల్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటు తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా పూర్తిగా డైలమాలో పడ్డారు. అసలు పరీక్షలు ఉంటాయో లేదో తెలియని పరిస్థితుల్లో ప్రిపరేషన్ మొత్తం అటకెక్కింది. దీంతో ఏపీ సర్కారు కూడా పరీక్షలపై ముందుకెళ్లాలా లేదా అని ఆలోచిస్తోంది.