సుప్రీం కోర్ట్ లో పరీక్షల నిర్వహణపై, రాష్ట్రం వైఖరి పై విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మంత్రి మాట్లాడుతూ...సుప్రీంకోర్టు లో ఏపీ, కేరళ రాష్ట్రానికి సంబంధించి 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పై వాదనలు జరిగాయని అన్నారు. సుప్రీంకోర్టు రాష్ట్రాల మీద ఆగ్రహం వ్యక్తం చేసిందని అనడం సరైనది కాదన్నారు. పరీక్షలు ఎందుకు నిర్వహించాలి, నిర్వహించాల్సిన అవసరం ఏమిటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని మంత్రి అన్నారు.