రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎక్కువ సపోర్ట్‌గా ఉండే సినీ హీరో ఎవరంటే? ఠక్కున మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పేయొచ్చు. రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమా రంగంలో సత్తా చాటుతున్న చిరు, సందర్భాన్ని బట్టి అటు కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఇటు జగన్ ప్రభుత్వాన్ని పొగుడుతూనే ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న చిరు..సినిమా ఇండస్ట్రీకు సంబంధించిన విషయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.