ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న అంబటి రాంబాబు, అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ తనదైన శైలిలో ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇస్తారనే సంగతి తెలిసిందే. అయితే ఇలా ప్రతిపక్షాలపై పంచ్‌లు వేసే అంబటి ఈ మధ్య ఓ వివాదంలో బాగా ఇరుక్కు పోయారు. ఓ యూట్యూబ్ చానల్‌కు వచ్చిన ఇంటర్వ్యూలో కాపు సామాజికవర్గం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు వర్గానికి చెందిన అంబటి అదే కాపు వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడారని రాష్ట్రంలోని కాపు ప్రతినిధులు ఫైర్ అవుతున్నారు.