రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముకం పట్టడంతో పాఠశాలలను తెరిచేందుకు రాష్ట్రప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. అయితే తాజాగా పాఠశాలలు తెరవటం మంచిది కాదని నీతి ఆయోగ్ హెచ్చరించింది. కరోనా పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా పాఠశాలలను తెరవడం మంచిది కాదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. బడిలో కేవలం విద్యార్థులే కాక ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి వైరస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని వీకే పాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.