గత ఎన్నికల్లో అన్నీ వర్గాల ప్రజలు జగన్కు మద్ధతు ఇవ్వడం వల్లే వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకోగలిగింది. అలాగే చాలా వర్గాలు దూరం అవ్వడం వల్లే టీడీపీకి ఓటమి ఎదురైంది. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి దూరమైన ఓటు బ్యాంకుని దగ్గర చేసుకోవాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా దళిత ఓటు బ్యాంక్ టీడీపీకి చాలా తగ్గింది.