టీకాలు కరోనాని అడ్డుకుంటాయా, లేదా అంటే.. ఇప్పటికీ అది అనుమానాలను మిగిల్చే ప్రశ్నే. టీకాలు తీసుకున్నవారు కూడా తర్వాతి కాలంలో వైరస్ బారిన పడిన ఉదాహరణలున్నాయి. అలాగని వ్యాక్సిన్ ని తక్కువ అంచనా వేయకూడదు, వైరస్ దుష్పరిణామాల తీవ్ర తగ్గించేందుకు టీకా తోడ్పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చైనా వ్యాక్సిన్ పై మాత్రం అమెరికా తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తోంది. చైనా టీకా వేసుకున్న దేశాల్లో కొత్తగా వెలుగు చూస్తున్న కరోనా కేసుల్ని చూపెడుతూ.. అమెరికా మీడియా వరుస కథనాలనిస్తోంది. కొత్త వేరియంట్లపై చైనా టీకా అసలు పనిచేయడంలేదని చెబుతోంది అమెరికా.