ఇటీవల నీటి కేటాయింపుల్లో ఏపీపై తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి.. అప్పటి వైఎస్ఆర్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ నీళ్లను దొంగతనంగా సీమాంధ్రకు తరలించారని, వైఎస్ కొడుకు జగన్ కూడా అలాగే నీటిని తరలించుకు వెళ్తున్నారంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ నేరుగా ఇలాంటి వ్యవహారాలపై స్పందిస్తారని అనుకోలేం కానీ, మిగతా నాయకులు కూడా నోరు మెదపకపోవడం విచిత్రం. అయితే షర్మిల టీమ్ మాత్రం టీఆర్ఎస్ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడింది. చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించింది.