పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి కాస్త బలం ఉన్న నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం కూడా ఒకటి. ముందు నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీకి మంచి బలం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అయిదుసార్లు గెలిచింది. కాంగ్రెస్ రెండుసార్లు, 2009లో ప్రజారాజ్యం, 2014లో టీడీపీతో పొత్తుతో బీజేపీ గెలిచాయి.